సైనిక వీరులకు వందనం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: శత్రు సైన్యాన్ని గడగడలాడించిన సైనిక వీరులకు వందనాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వారి పరాక్రమం అజారామరం అన్నారు. 25వ కార్గిల్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. హిమాలయాలలోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో భారత జవాన్ల పోరాటం వీరోచితమైనదన్నారు. శత్రు సైన్యాన్ని గడగడలాడించి తరిమి కొట్టారని కొనియాడారు. పరాక్రమం ప్రదర్శిస్తున్న సైనిక రంగానికి తన సెల్యూట్ తెలిపారు. వీరి ధైర్యం వల్లే కార్గిల్ పై త్రివర్ణ పతాకం రెపరెపలాడిందని అమిత్ షా తెలిపారు.