తిరోగమన బడ్జెట్​ నీరు గారిన ఆరు గ్యారంటీలు

Regressive budget watered six guarantees

Jul 26, 2024 - 14:19
 0
తిరోగమన బడ్జెట్​ నీరు గారిన ఆరు గ్యారంటీలు

బడ్జెట్​ లో పడకేసిన సంక్షేమం
అక్కా చెల్లెమ్మలకు తప్పని నిరాశ
ఫించన్లపై కేటాయింపులేవీ?
కేసీఆర్​ పాలనలోనే తెలంగాణ అగ్రభాగాన
మూడురెట్లు స్థూల నిష్పత్తిని పెంచింది కేసీఆరే
రాహుల్​, ప్రియాంకల హామీలూ నీటిమూటలే
జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్​ గుడిపూడి నవీన్​ రావు

నా తెలంగాణ, డోర్నకల్​: కాంగ్రెస్​ బడ్జెట్​ ఆరు గ్యారంటీలు నీరు గారిపోయాయని బడ్జెట్​ లో సంక్షేమం పడకేసిందని మహాబూబాబాద్​ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్​ గుడిపూడి నవీన్​​ రావు ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రవేశపెట్టింది తిరోగమన బడ్జెట్​ అని విమర్శించారు. 

మహిళలకు నెలకు రూ. 2500, గ్యాస్​ సబ్సిడీ, పక్కా ఇళ్లు, విద్య, వైద్యంపై సరైన ప్రణాళికలనే వివరించలేదన్నారు. తూతూ మమ అన్నట్లుగా అంకెల గారడీనే బడ్జెట్​ ప్రసంగంలో ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ వాగ్ధానం చేసిన ఏ ఒక్క గ్యారంటీకి నిధులు ఎలా సమకూరుస్తారనే విషయంపై స్పష్టత కొరవడిందన్నారు. 

అక్కాచెల్లెమ్మలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. రూ. 4పింఛన్​ ఏమైందని ప్రశ్నించారు. కొత్త పింఛన్లు ఇవ్వరా? అని నిలదీశారు. రైతు రుణమాఫీ రూ. 31వేల కోట్లకు కేవం 15వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని అన్నారు. కొత్త పింఛన్లు, ఐదు డీఏలు, పీఆర్సీల ప్రస్తావనే బడ్జెట్​ లో లేదన్నారు. పంచాయతీలకు ఒక్కపైసా కేటాయించకపోగా కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా అడ్డుకున్నారని ఆరోపించారు.

టీఆర్​ఎస్​ హయాంలో చేసిన అభివృద్దిని తమ అభివృద్ధిగా చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్​ పాలన కారణంగానే తెలంగాణ ఆర్థిక రంగంలో అగ్రభాగాన నిలిచిందన్నారు. రాష్ర్ట స్థూల నిష్పత్తి మూడు రెట్లు కేసీఆర్​ పెంచగలిగారని హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి గతేడాది రూ. 9729 కోట్ల గ్రాంట్లు వస్తే ఈ యేడాది ఆ నిధులను రూ. 21,636గా చూపారని ఆ నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. నగదుపై వడ్డీ ద్వారా రూ.605 కోట్లు వస్తుందని పేర్కొన్నారని, గతేడాది రూ.24 లక్షలు నెగెటివ్ వచ్చాయని గుర్తు చేశారు. ఈ ఏడాది అప్పులపై వడ్డీలు రూ.17,729 కోట్లు, అసలు రూ.13,117 కోట్లు కట్టాలని సీఎం, డిప్యూటీ సీఎం నెలకు రూ.7000 కోట్లు కడుతున్నామని చెప్పారని ఆక్షేపించారు.

ఎక్సైజ్​ పై ఆదాయం రూ. 7,045 పెంచుకుంటామని చెబుతున్నారని ఇదేలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. తెలంగాణను తాగుబోతుగా తీర్చిదిద్దుతారా? అని మండిపడ్డారు. మద్యంపై రూ. 14వేల కోట్లు ఎక్కువగా సంపాదించాలని ప్రభుత్వం అనుకుంటోందని విమర్శించారు. 

కాంగ్రెస్​ పార్టీ కేంద్ర నాయకులు రాహుల్​, ప్రియాంకలు ఇచ్చిన హామీలు కూడా నీటిమూటలే అయ్యాయన్నారు. నీటిపారుదల, పింఛన్​ వంటి వాటికి బడ్జెట్​ లో కేటాయింపులే లేవని గుడిపుడి నవీన్​ రావు ఆరోపించారు.