సిసోడియాకు చుక్కెదురు
విచారణ వాయిదా నిరాశ నిస్పృహల మధ్య ఆప్ ఏప్రిల్ 26న మరోమారు విచారణ
ఢిల్లీ: మద్యం కుంభకోణంలో మరోమారు మనీష్ సిసోడియాకు చుక్కెదురైంది. రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియా బెయిల్ పిటిషన్ నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. శనివారం ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది. ఏప్రిల్ 15న బెయిల్ పిటిషన్ ను విచారించింది. 20వ తేదీకి వాయిదా వేసింది.
కాగా కోర్టులో సీబీఐ తరపున వాదనలు వినిపించారు. సిసోడియా బెయిల్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్‌పై కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిందని, అందుకే ఇప్పుడు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సిసోడియా తరపు న్యాయవాది మీడియాకు తెలిపారు. ఢిల్లీలో ఏడు స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. సిసోడియాకు బెయిల్ లభిస్తే ప్రచారంలో భాగమవుతారని ఆప్ పార్టీ ఆశించింది. విచారణ వాయిదా పడడంతో మరోసారి ఆప్ పార్టీలో నిరాశ నిర్వేదాలు కమ్ముకున్నాయి. గతేడాది 26 ఫిబ్రవరి 2023న సిసోడియాను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు.కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 26న చేపట్టనుంది.