779 జిల్లాల్లో 5 జీ సేవలు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
5G services in 779 districts Union Minister Pemmasani Chandrasekhar
నా తెలంగాణ, న్యూఢిల్లీ: ఫైవ్ జీ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించామని కేంద్ర కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ కు బుధవారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో 783 జిల్లాల్లో 779 జిల్లాల్లో 5 జీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, తీర ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా 5జీ సేవలను విస్తరించారని, కనీస రోల్ అవుట్ బాధ్యతలను మించి పోయారని అన్నారు. 4జీ, 5జీ నెట్ వర్క్ ల లభ్యత, వినియోగదారులలో ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు, ఈ కామర్స్, ఆన్ లైన్ విద్య, ప్రభుత్వ సేవల్లో పెరుగుదల నమోదైనట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా ముందుకు వెళ్లేందుకు 2జీ, 3జీ, 4జీ తరువాత 5జీ నెట్ వర్క్ ను భారత్ లో ప్రవేశపెట్టింది. 5జీ ద్వారా మరింత మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో విజయం సాధించింది.