తిలక్​, ఆజాద్​ సేవలు ఎనలేనివి

జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు

Jul 23, 2024 - 11:30
 0
తిలక్​, ఆజాద్​ సేవలు ఎనలేనివి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతదేశ గొప్ప స్వాతంత్ర సమరయోధులు బాలగంగాధర్​ తిలక్​, చంద్రశేఖర్​ ఆజాద్​ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీరి జాతీయవాద అవిశ్రాంత పోరాటం ఎంతోమందిలో స్ఫూర్తిని రగిల్చిందన్నారు. మంగళవారం బాలగంగాధర్​ తిలక్​, చంద్రశేఖర్​ ఆజాద్​ ల జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులర్పించారు. విద్యాభివృద్ధికోసం తిలక్​ చేసిన కృషి ఎనలేనిదన్నారు. అచంచలమైన ధైర్యంతో పోరాటం చేసిన వీరుడు చంద్రశేఖర్​ ఆజాద్​ అని కొనియాడారు. వీరిద్దరి ఆశలు, ఆశయాలు కోట్లాది భారతీయుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయని యువత వీరి స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.