అమర్ నాథ్ యాత్ర రికార్డు స్థాయిలో యాత్రికుల సందర్శన
Amarnath Yatra is a record number of pilgrims
శ్రీనగర్: అమర్ నాథ్ యాత్రలో 4 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. గతేడాది రికార్డును అధిగమించారు. ఈ విషయాన్ని అమర్ నాథ్ క్షేత్ర ట్రస్టు మంగళవారం తెలిపింది. తీర్థయాత్ర ముగిసేందుకు ఇంకా నెల రోజుల సమయం ఉంది. సోమవారం వరకు 4,07,734మంది అమర్ నాథ్ ను సందర్శించినట్లు పేర్కొంది.
యాత్ర నేపథ్యంలో ప్రభుత్వం గతేడాది కంటే కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. పలుమార్లు యాత్రను వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా యాత్రను నిలిపివేశారు. అనంతరం తిరిగి యాత్రను సజావుగా చేపట్టారు.