నీట్ ప్రశ్నాపత్రం లీక్.. రెండో చార్జీషీట్ దాఖలు
NEET question paper leaked. Second charge sheet filed
పట్నా: నీట్ యూజీ 2024 ప్రశ్నాపత్రం లీక్ కేసులో ఆరుగురు నిందితులపై సీబీఐ రెండో చార్జ్ షీట్ దాఖలు చేసింది. శుక్రవారం సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జీషీట్ లో ఆరుగురు నిందితుల పేర్లు ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120-బి, సెక్షన్ 109 సెక్షన్ 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), సెక్షన్ 420, సెక్షన్ 380తో సహా వివిధ నిబంధనల ప్రకారం ఛార్జ్ షీట్ ను సమర్పించారు.
ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎహ్సానుల్ హక్, ఎండీ. ఇంతియాజ్ ఆలమ్‌పై అవినీతి నిరోధక చట్టం, 1988లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. బల్దేవ్ కుమార్ అలియాస్ చింటూ, సన్నీ కుమార్, డాక్టర్ ఎహసానుల్ హక్, ఎండీ ఇంతియాజ్ ఆలం, హజారీబాగ్‌కు చెందిన స్థానిక జర్నలిస్టు జమాలుద్దీన్, అమన్ కుమార్ సింగ్‌ల పేర్లు ఈ చార్జీషీట్ లో ఉన్నాయి. కాగా ఇప్పటివరకు ఈ కేసులో 48మందిని అరెస్టు చేయగా, తొలి చార్జీ షీట్ లో 13మంది నిందితుల పేర్లను నమోదు చేసింది.