శిక్షణ విమానం క్రాష్ ల్యాండ్
బయటపడ్డ పైలెట్, ట్రైనీ పైలెట్లు
జంషెడ్ పూర్: జంషెడ్ పూర్ నుంచి బయలుదేరిన శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. మంగళవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సోనారీ నుంచి బయలుదేరిన విమానం అమ్డా ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో పైలెట్, ట్రైనీ పైలెట్ ఉన్నారన్నారు. వీరిద్దరు గాయాలతో బయటపడ్డారని తెలిపారు.
విమానం టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. చివరగా వచ్చిన సిగ్నల్ ద్వారా విమానం ఆచూకీ కనుగొన్నామన్నారు. ఆమ్డా ప్రాంతంలో కూలిపోయిందనే సమాచారంతో ఘటనా స్థలికి అధికారులు చేరుకున్నారు. పైలెట్, ట్రైనీ పైలెట్లు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే విమానం కూలిపోయిందా, ల్యాండింగ్ అయిందా? లేక మరేదైనా కారణమా? అన్న విషయాలను అధికారులు పేర్కొనలేదు. అయితే ఈ విమాన ప్రమాదంపై ఇంతకుముందు విమానాన్ని తనిఖీ చేసిన అధికారి మాట్లాడుతూ.. ఈ విమానం ఇంజన్ లో వైఫల్యం ఉందని ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని గతంలోనే తెలిపానని వివరించారు.