జీఎస్టీ బకాయిలు  రాష్ట్రాలకు చెల్లింపులు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​

Jun 22, 2024 - 19:26
 0
జీఎస్టీ బకాయిలు  రాష్ట్రాలకు చెల్లింపులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జీఎస్టీ బకాయిలను కేంద్రం రాష్ట్రాలకు సకాలంలో చెల్లిస్తుందని, దీన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు. బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం సంస్కరణలను అమలు చేయడానికి కేంద్రం రాష్ట్రాలకు 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను ఇచ్చే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీతారామన్ కోరారు. సకాలంలో పన్ను బదిలీలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, వృద్ధిని ప్రోత్సహించేందుకు జీఎస్టీ పరిహారం బకాయిల ద్వారా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాలకు కేటాయింపులపై పలువురు ఆర్థిక శాఖ మంత్రులు వినతులు చేశారని మంత్రి తెలిపారు.