సుస్థిర అభివృద్ధికి పునాది బడ్జెట్
2024–25 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2024–25లో ప్రవేశపెడుతున్న బడ్జెట్ భారత్ ను 2047 వరకు సుస్థిర అభివృద్ధి సాధనకు ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పునాదిగా నిలుస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మంగళవారం బడ్జెట్ ప్రసంగాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్ సుస్థిర అభివృద్ధికి బ్లూప్రింట్ ను సిద్ధం చేస్తున్నామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతిని ప్రదర్శిస్తోందన్నారు. ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని, 4 శాతం వైపు కదులుతోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేదలు, యువత, మహిళలు, రైతులు వంటి ముఖ్యమైన వర్గాల అభివృద్ధిపై దృష్టి సారించే ప్రయత్ చేస్తుందన్నారు. అదే సమయంలో ఉపాధి, నైపుణ్యాలు, ఎంఎస్‌ఎంఈ, మధ్యతరగతి రంగాలపై నిరంతరం దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
తమ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2024–25 బడ్జెట్ లో అన్ని రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని నిర్మలా సీతరామన్ తెలిపారు.
ఏ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నామో వివరించారు.
1. వ్యవసాయంలో ఉత్పాదకత, స్థితిస్థాపకత
2. ఉపాధి, నైపుణ్యాలు
3. సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం
4. తయారీ, సేవలు
5. పట్టణాభివృద్ధి
6. ఇంధన సంరక్షణ
7. మౌలిక సదుపాయాలు
8. ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి
9. కొత్త తరం అభివృద్ధి