లాభాల వాటాను తక్షణమే విడుదల చేయాలి

The profit share should be released immediately

Sep 10, 2024 - 22:45
 0
లాభాల వాటాను తక్షణమే విడుదల చేయాలి
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: మావోయిస్టు అనుబంధ సంఘం భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్, సింగరేణిని డిమాండ్ చేస్తూ మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
2024-25 సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల వాటాలో 30 శాతం వాటాను తక్షణమే సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులతో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులందరికీ లాభాల వాటా సెప్టెంబర్ నెల చివరిలోపు పంపిణీ చేయాలని యాజమాన్యాన్ని కోరారు. సింగరేణిలో ఐదు జాతీయ సంఘాల నాయకులు కేవలం పైరవీలకు అలవాటుపడి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను  చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న మేనేజ్​ మెంట్​ కు సహకరిస్తున్నారని, ఫలితంగా పర్మినెంట్ కార్మికులతో పాటు కాంటాక్ట్ కార్మికులు ఆశించిన ఫలితాలను, హక్కులను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాంగ్రెస్ పాలకులు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సొంతింటి పథకం, ఇన్​ కమ్​ ట్యాక్స్​ (ఆదాయపు పన్ను) అలవెన్స్ యాజమాన్యం చెల్లించడం, సింగరేణి అండర్ గ్రౌండ్ గనులను తవ్వి కొత్త ఉద్యోగాలకు అవకాశాలు, కాంట్రాక్టు ఒప్పంద కార్మికులను పర్మనెంట్ చేయడం మొదలైన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ సింగరేణిని డిమాండ్ చేశారు.