మునిసిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

MLA angry with municipal officials

Oct 7, 2024 - 18:56
 0
మునిసిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

నా తెలంగాణ, నిర్మల్: గత ఆరు రోజులుగా నిర్మల్ మునిసిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో నిర్మల్ ఎమ్మెల్యే మునిసిపల్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మునిసిపల్ కార్మికుల సమ్మె విషయంపై ఆరా తీశారు. మూడు మాసాలుగా వేతనాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పన్నులు వసూలు అవుతున్నా వేతనాలు ఇవ్వడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. కార్మికులతో మాట్లాడుతూ త్వరలో వేతనాలు చెల్లించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఈశ్వర్, కమిషనర్ సి వి ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.