సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

Mass Varalakshmi Vratas

Aug 16, 2024 - 18:54
 0
సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలో ఉన్న శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు తరలివెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శ్రీకోదండ రామాలయం, గణపతి ఆలయాల్లో అత్యంత వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించి, అమ్మ వారికి అర్చనలు నిర్వహించారు. వేద పండితులు అంబ ప్రసాద్ అమ్మవారి మహిమను, వరలక్ష్మీ వ్రత ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు.