సంజౌలీపై హిందూ సంఘాల ఆందోళన

హనుమాన్​ చాలీసా చదువుతూ నిరసన

Sep 11, 2024 - 12:45
 0
సంజౌలీపై హిందూ సంఘాల ఆందోళన
సిమ్లా: అక్రమంగా నిర్మించిన సంజౌలీ మసీదును వెంటనే కూల్చివేయాలని హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. బుధవారం ఉదయం నుంచి సిమ్లాలో చేపట్టిన ఈ ఆందోళనలో పలు సంఘాలు పాల్గొన్నాయి. దీంతో సిమ్లాలోని సంజౌలీ మసీదు ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్​ విధించారు. ఆ ప్రాంతంలోకి ఇతరులను రానీయకుండా భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆందోళనకారులు  సంజౌలీ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ బారికేడ్లను పక్కకు తప్పించారు. దీంతో పోలీసులు, హిందూ సంఘాలకు మధ్య పెద్ద పెట్టున తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలీసులు సర్ది చెప్పినా ఆందోళనకారులు వినకుండా ఆ ప్రాంతంలోనే బైఠాయించి హనుమాన్​ చాలీసా చదువుతూ బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. 
 
ఏమిటీ సంజౌలీ మసీదు వివాదం..
సంజౌలీ మసీదు ఉన్న ప్రాంతంలో చిన్నగా ఒక ఇళ్లు ఉండేది. ఆ ఇంటి ఓనరు ఆ ఇంటిని ఇతరులకు అమ్మేసి ఇతర ప్రాంతానికి వెళ్లిపోయాడు. కొన్నవారు ఎవ్వరికీ తెలియకుండా చిన్నపాటి రేకులతో కూడిన మసీదులా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు అడిగినా అది ఇళ్లేనని బదులిచ్చారు. క్రమేణా వారం వారం ఓ 20మంది వరకు ఆ ఇంటికి వస్తూ ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. ఇంతలో కరోనా మహమ్మారి చుట్టుముట్టింది. ఇదే అదనుగా ఆ ఇంటిచుట్టూ ప్లాస్టిక్​ కవర్లు కట్టేసుకొని నాలుగు అంతస్థుల్లో అక్రమంగా మసీదు నిర్మించారు. దీనిపైనే ఆ ప్రాంతావాసులు, హిందూసంఘాలు మండిపడుతున్నాయి. ఈ ప్రాంతంలో మసీదు కట్టేందుకు అనుమతి ఎలా ఇస్తారని వెంటనే దాన్ని కూల్చివేయాలని డిమాండ్​ చేస్తున్నారు.