కన్హయ్యపై దాడి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

The police have arrested the accused in the attack on Kanhaiya

May 18, 2024 - 13:38
 0
కన్హయ్యపై దాడి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కూటమి అభ్యర్థి కన్హయ్య కుమార్​ పై శుక్రవారం దాడి జరిగింది. పూలమాల వేసేందుకు వచ్చిన వ్యక్తి కన్హయ్యను చెంపదెబ్బకొట్టాడు. ఈ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​ గా మారడంతో శనివారం వెలుగులోకొచ్చింది. అక్కడే ఉన్న కన్హయ్య మద్ధతుదారులు ఆ వ్యక్తిని చితకబాదారు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. దాడి చేసిన వ్యక్తి దక్ష్ కుమార్ ఘజియాబాద్ నివాసి అని పోలీసులు గుర్తించారు. 
కన్హయ్య కుమార్​ ప్రచారం కోసం న్యూ ఉస్మాన్‌పూర్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత ఆప్ కౌన్సిలర్ ఛాయతో కలిసి బయటికి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు నినాదాలు చేస్తూ కన్హయ్య వద్దకు చేరుకున్నారు. వీరిలో దక్ష్​ కుమార్​ కన్హయ్యకు పూలమాల వేస్తుండగా చెంపదెబ్బ కొట్టాడు. అనంతరం కన్హయ్యకు నల్లజెండాలు చూపి గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాడు. కన్హయ్య ఢిల్లీ నార్త్​ సెంట్రల్​ కాంగ్రెస్​ సీటుపై పోటీలో ఉన్నారు.