మాలివాల్ పై దాడి కీలక మలుపులు తిరుగుతున్న కేసు
వీడియో విడుదల కోర్టుకు వాంగ్మూలం సమర్పణ సీన్ రిక్రియేట్.. దాడి జరగలేదన్న ఆప్ మంత్రి అతిషి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్వాతి మాలివాల్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. గురువారం రాత్రి ఆమెను విచారించిన పోలీసులు అనంతరం వైద్య పరీక్షల కోసం ఏయిమ్స్ కు తరలించారు. శుక్రవారం ఉదయం కోర్టుకు తరలించారు. కోర్టు మాలివాల్ వాంగ్మూలం నమోదు చేసింది. అనంతరం పోలీసులు సీన్ రీ క్రియేట్ చేసేందుకు ఢిల్లీ సీఎం హౌస్ కు భారీ బందోబస్తు నడుమ చేరుకున్నారు. సీన్ రీక్రియేట్ చేశారు.
మరోవైపు స్వాతి మాలివాల్ పై సీఎం హౌస్ లో దాడి జరిగిందనే వీడియో కూడా కలకలం రేపింది. కానీ ఆ వీడియోలో భద్రతా సిబ్బంది ఆమెతో మర్యాదపూర్వకంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. సోఫాలో మాలివాల్ కూర్చొన్న వీడియో రిలీజైంది. మరోవైపు ఈ వీడియో అనంతరం ఏం జరిగిందన్నది సస్పెన్స్ గా మారింది. అనంతరమే దాడి జరిగిందని స్వాతి ఆరోపిస్తోంది.
మొత్తానికి పోలీసులు మాలివాల్ ఆరోపణలపై బిభవ్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నారు.
దాడిపై ఆప్ మంత్రి అతిషి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వీడియో విడుదలతో స్వాతిపై ఎవ్వరు దాడికి పాల్పడలేదని స్పష్టమవుతోందన్నారు. ఆమెను భద్రతా సిబ్బందిని బెదిరించిన తీరు కనిపిస్తోందన్నారు. అనవసరం బిభవ్ ను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్వాతి మాలివాల్ పై బిభవ్ కూడా ఫిర్యాదు చేశారని కేసు నమోదైందని తెలిపారు.