ఎన్సీపీకి మరో ఎదురు దెబ్బ బీజేపీలోకి పవార్​ వర్గం నేత

Another blow to NCP is Pawar faction leader joining BJP

Aug 12, 2024 - 14:54
 0
ఎన్సీపీకి మరో ఎదురు దెబ్బ బీజేపీలోకి పవార్​ వర్గం నేత

ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ(శరద్​ పవార్​) పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పవార్​ వర్గానికి చెందిన మాణిక్​ రావు సోన్​ వాల్కర్​ సోమవారం బీజేపీలోకి అడుగిడారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర బీజేపీ చీఫ్​ చంద్రశేఖర్​ బవాన్​ కులే కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం బవాన్​ కులే మాట్లాడుతూ.. సోన్​ వాల్కర్​ పార్టీలో చేరడంతో బీజేపీ మరింత పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్సీపీ, కాంగ్రెస్​ పార్టీలు దేశంపై బురద జల్లే ప్రయత్నాలను పలువురు విపక్ష పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీలో చేరి దేశాభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు.  ఇది శుభపరిణామమన్నారు.