పెమ్మసాని ఆస్తులు రూ. 5,785 కోట్లు

దేశంలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా రికార్డు

Apr 23, 2024 - 19:55
 0
పెమ్మసాని ఆస్తులు రూ. 5,785 కోట్లు

విశాఖపట్నం: గుంటూరు నుంచి టీడీపీ లో లోక్​ సభ అభ్యర్థిగా పోటీలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్​ ఆస్తులు రూ. 5,785 కోట్లుగా ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఈయనే మొదటి స్థానంలో సంపన్న అభ్యర్థిగా నిలిచారు. 

ఆయన దాఖలు చేసిన అఫిడవిట్​ లో వ్యక్తిగతంగా రూ. రూ.2,448.72 కోట్లు కాగా, ఆయన భార్య శ్రీరత్న కోనేరు ఆస్తుల విలువ రూ.2,343.78 కోట్లు, పిల్లల ఆస్తులు దాదాపు రూ.1,000 కోట్లుగా ప్రకటించారు. అయితే రూ. 717 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో మొదటి వరుసలో ఉన్నారు. తాజాగా పెమ్మసాని మొదటి సంపన్న అభ్యర్థుల జాబితాలో నిలిచారు. ప్రజాసంక్షేమంపై ఆసక్తి ఉన్న చంద్రశేఖర్​ ఎన్నారై టీడీపీ విభాగం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.