మాలివాల్ పై దాడి పోలీసుల అదుపులో విభవ్ మరో వీడియో రిలీజ్
Attack on Maliwal, Vibhav in police custody, another video release
నా తెలంగాణ, న్యూఢిల్లీ: ఆప్ రాజ్యసభ సభ్యురాలు, ఎంపీ స్వాతిమాలివాల్ పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఏయిమ్స్ వైద్య రిపోర్టులో ఆమె ముఖం, కాళ్లపై అంతర్గతంగా గాయాలున్నట్లుగా పేర్కొన్నారు. కాగా శుక్రవారం స్వాతికి సంబంధించి ఓ వీడియో రిలీజ్ కాగా శనివారం మరో వీడియో కూడా రిలీజైంది. ఆ వీడియోలో స్వాతి మాలివాల్ సీఎం హౌస్ నుంచి బయటికి వెళుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆమె చుట్టు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఓ మహిళా గార్డు ఆమెను చేయి పట్టుకొని బయటికి తీసుకువస్తున్నాట్లు వీడియోలో కనిపించింది.
...............