బీబీఎంపీ రూ. 46,300 కోట్ల అవినీతి

BBMP Rs. 46,300 crore corruption

Nov 26, 2024 - 15:26
 0
బీబీఎంపీ రూ. 46,300 కోట్ల అవినీతి

ఈడీకి యాంటీ కరప్షన్ ఫోరమ్ అధ్యక్షుడి ఫిర్యాదు
18 మంది అధికారులపై ఆధారాల సమర్పణ

బెంగళూరు: బెంగళూరు మెట్రోపాలిటన్​ కార్పొరేషన్​ (బీబీఎంపీ)లో రూ 46,300 కోట్ల కుంభకోణం జరిగిందని కర్ణాటక అవినీతి నిరోధక అధ్యక్షుడు ఎస్​. ఆర్​.రమేష్​ ఆరోపించారు. మంగళవారం ఈ అవినీతి గుట్టుతేల్చాలని అవినీతికి పాల్పడ్డవారిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఈడీకి లేఖ రాశారు. ఈ లేఖను, అవినీతికి సంబంధించిన పలు పత్రాలను మీడియా ముందుంచారు. 2013 నుంచి 2024 వరకు తొమ్మిదనరేళ్లలో బెంగళూరు మెట్రో పాలిటన్​ కార్పొరేషన్​ ద్వారా రూ 46,300 కోట్ల భారీ గ్రాంట్​ అభివృద్ధి పనులకై విడుదలైంది. కార్పొరేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఉమాశంకర్‌, 18 మంది ఐఏఎస్‌ అధికారులు, కార్పొరేషన్‌లోని అవినీతి అధికారులందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో ఫిర్యాదు చేసి 4అవినీతికి సంబంధించిన 4113 పేజీల పత్రాల నివేదికను సమర్పించారు. ఇందులో 75 శాతం గ్రాంట్​ సొమ్ము దుర్వినియోగమైందని ఆరోపించారు. ఈ మెగా స్కామ్​ కు సంబంధించి బీఎన్​ ఎస్​ 2023 ప్రజానిధుల దుర్వినియోగం చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.