బాలరాముని సందర్శన కోటి దాటిన భక్తుల సంఖ్య!
హిందువుల జనాభా 116 కోట్లు. 22 జనవరి నుంచి మార్చి 10 వరకు కోటి మంది భక్తులు అయోధ్యను సందర్శించారు.
అయోధ్య: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు, మసీదులలో కూడా నిర్మాణం జరిగిన కొద్దిరోజుల్లో అంతాలా సందర్శన ఉన్నట్లు ఉనికిలో లేదు. కానీ రామ మందిరం నిర్మాణం జరిగిన 48 రోజుల్లేనే కోటిపైగా భక్తులు వచ్చినట్లు ఆలయ వర్గాల పేర్కొంటున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వాటికన్, మక్కాలలో కలిపి ఈ ఏడాదిలో 2.25 కోట్ల మంది భక్తులు సందర్శరించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే అయోధ్య బాలరాముని దర్శనానికి రోజుకు 2 లక్షల మంది చొప్పున దర్శించుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ లెక్క కేవలం జనవరి 22 నుంచి మార్చి 10 వరకు మాత్రమేనని రామ మందిర ట్రస్టు స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్లోని ఇటీవలే నిర్మించిన అత్యంత భారీ బాలరాముని ఆలయం. 53 దేశాలలో హిందువులు విస్తరించి ఉన్నారు. సంఖ్యాపరంగా చూసుకుంటే హిందువుల జనాభా 116 కోట్లు. 22 జనవరి నుంచి మార్చి 10 వరకు కోటి మంది భక్తులు అయోధ్యను సందర్శించారు.