కచ్చతీవుపై చిదంబరం వ్యాఖ్యలు

కేంద్రమంత్రి హర్దీప్​ పూరి విమర్శలు

Apr 3, 2024 - 17:56
 0
కచ్చతీవుపై చిదంబరం వ్యాఖ్యలు

ఢిల్లీ: కచ్చతీవుపై ప్రధాని వ్యాఖ్యలపై మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం చేసిన ప్రకటనను కేంద్రమంత్రి హర్దీప్​సింగ్​పూరి విమర్శించారు. బుధవారం పూరి మీడియాతో మాట్లాడారు. ఈ ద్వీపంపై ఇరుదేశాలకు హక్కులు ఉండేవని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోందన్నారు. అయితే వీటిని అప్పటి ప్రధానులు జవహర్​లాల్​ నెహ్రూ, ఇందిరాగాంధీలు శ్రీలంకకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని మండిపడ్డారు.  ఆ సమయంలో మాజీ దౌత్యవేత్త కేవల్​సింగ్​ మద్రాస్​ వెళ్లి అప్పటి సీఎంతో సమావేశమయ్యారని పేర్కొన్నారు. వీరంతా కొన్ని సూత్రాలపై అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. దీని కారణంగానే భారత్​కు కూడా దక్కాల్సిన ఈ ద్వీపం కాస్త శ్రీలంకకు దక్కిందన్నారు. అయితే అంతర్గతంగా ఈ ద్వీపానికి సంబంధించి అప్పట్లో చేసుకున్న ఒప్పందంలో అనేక లొసుగులున్నాయని హర్దీప్​ పూరి స్పష్టం చేశారు. ఈ విషయాలన్నీ పూర్తి ఆధారాలను సమీక్షించాకే  భారత విదేశాంగ మంత్రి ఎస్​. జై శంకర్​ వాస్తవాలు, రికార్డులతోనే చెప్పారని తెలిపారు. చిందబరం సమస్యను పూర్తిగా ఔపోసన పట్టనట్లుగా ఉందని పూరి ఎద్దేవా చేశారు.