వందేభారత్​ స్లీపర్​ రైలు నమూనా సిద్దం

త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​

Dec 7, 2024 - 12:30
 0
వందేభారత్​ స్లీపర్​ రైలు నమూనా సిద్దం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వందేభారత్​ స్లీపర్​ రైలు తొలి నమూనా సిద్ధమైందని, త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ట్రయల్స్​ విజయవంతంమైతే త్వరలోనే స్లీపర్​ రైలు అందుబాటులోకి వస్తుందన్నారు. స్లీపర్​ రైలులో ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఫైర్​ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రైలు మేనేజర్​/లోకోపైలట్​ మధ్య కమ్యూనికేషన్​ కోసం ఎమర్జెన్సీ ట్యాక్​ బ్యాక్​ యూనిట్​ కూడా ఇన్​ స్టాల్​ చేస్తామన్నారు. రైలు కోచ్​ లలో ఎయిర్​ కండిషనింగ్​, లైటింగ్​ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామన్నారు. అన్ని కోచ్​ లలో సీసీ కెమెరాలుంటాయన్నారు. పై బెర్త్​ కు సులభంగా ఎక్కేందుకు ఎర్గోనామిక్​ మెట్లని రూపొందించామని మంత్రి తెలిపారు. ఆధునిక టాయిలెట్​ సీట్లు ఏర్పాటు చేశామన్నారు.