నాలుగోదశ ప్రచార అంకం పూర్తి
నాలుగోదశ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం ఐదు గంటలతో తెరపడింది.
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నాలుగోదశ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం ఐదు గంటలతో తెరపడింది. ప్రచారంలో ఇన్నిరోజులు హెరెత్తించిన నాయకులు కాస్త ప్రచారానికి సమయం ముగియడంతో ఉపశమనం పొందారు. నాలుగో విడతలో 96 స్థానాలలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 25, ఛత్తీస్‌గఢ్‌లో 5, ఝార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 8 సీట్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రచార అంకం ముగియడంతో ఈసీ పోలింగ్ నిర్వహణ కోసం ముమ్మర ఏర్పాట్లను చేస్తోంది. నాలుగో విడతలో 10.5 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా, 55 లక్షల ఈవీఎంలను పోలింగ్ కోసం ఏర్పాటు చేశారు. చత్తీస్ గఢ్, ఝార్ఖండ్ 4, పశ్చిమ బెంగాల్ లలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు.