ఆప్ సంబురాలు బీజేపీ విమర్శలు
జైల్ రిటర్న్ ఆప్ నాయకుడు సీఎం కేజ్రీవాల్ సంబురాలు చేసుకోవడం అవివేకమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడ్డారు.
నా తెలంగాణ, ఢిల్లీ: జైల్ రిటర్న్ ఆప్ నాయకుడు సీఎం కేజ్రీవాల్ సంబురాలు చేసుకోవడం అవివేకమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడ్డారు. తీహార్ జైలులో ఉంటూ కూడా ఆయనకు పశ్చాత్తాపం కలగకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. శనివారం సుధాన్షు త్రివేది ఆప్ సంబురాలపై మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, కూటమి నేతలంతా జైలులో గడిపి వచ్చి దేశభక్తుల్లా ప్రవర్తించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఇప్పటికే అనేకమంది ఆ పార్టీ నేతల తీరు సిగ్గులేని విధంగా ఉందన్నారు. అవినీతి, అక్రమాలు చేసిన నాయకులకు ప్రజా మద్దతు లభించదన్నది గుర్తెరగాలని సుధాన్షు పేర్కొన్నారు.