కాల్పుల విరమణకు హిజ్బుల్లా ఓకే
డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసిం లెబనాన్ లో ఇజ్రాయెల్ జెండా పాతిన ఐడీఎఫ్
బీరూట్: ఎట్టకేలకు హిజ్బుల్లా తొలిసారిగా కాల్పుల విరమణను కోరింది. హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసిం ఈ విషయాన్ని బుధవారం స్పష్టం చేశారు. కాల్పుల విరమణ కోసం లెబనీస్ పార్లమెంట్ స్పీకర్ నబీహ్ బెర్రీ చేస్తున్న ప్రయత్నాలకు హిజ్బుల్లా మద్దతు ఇస్తుందని ఖాసిమ్ చెప్పారు. కాల్పుల విరమణ కుదిరిన తర్వాత ఇతర విషయాలపై చర్చిస్తారు. గాజాలో కాల్పుల విరమణ కుదిరినప్పుడే ఇజ్రాయెల్‌పై దాడులను ఆపుతామని హిజ్బుల్లా గతంలో చెప్పారు. మరోవైపు హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో చాలావరకు స్థావరాలు ధ్వంసమైనట్లుగా ప్రకటించింది. లెబనాన్ నుంచి పూర్తిగా హిజ్బుల్లాను తరిమికొట్టేవరకు వదిలేదని భీష్మించుకుంది. లెబనాన్ లోని మరూన్ అల్ రాస్ లో ఇరాన్ గార్డెన్ పార్క్ శిథిలాలపై ఇజ్రాయెల్ తమ దేశం జెండాను ఎగురవేసింది.
హమాస్ కు మద్ధతుగా ఇజ్రాయెల్ పై దాడులకు దిగిన హిజ్బుల్లా తమకు వాటిల్లుతున్న నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు నో చెప్పడం విశేషం.