తలకెక్కిన మతోన్మాదం హిందు పండుగలపై దాడులు

Attacks on Hindu festivals with rampant fanaticism

Sep 18, 2024 - 12:31
 0
తలకెక్కిన మతోన్మాదం హిందు పండుగలపై దాడులు
దేశవ్యాప్తంగా ఊరేగింపులు, ర్యాలీలపై 9 దాడులు
27 మంది అరెస్టు.. మైనర్లే ఎక్కువ
దాడులకు ఊసిగొల్పిన వారికోసం పోలీసుల విచారణ
హిందూ సంఘాల ఆందోళన, హెచ్చరికలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మతోన్మాదం తలకెక్కించుకున్న కొందరి వల్ల ముస్లింలకు చెడ్డ పేరు వస్తోంది. తరచూ హిందూపండుగలే లక్ష్యంగా రాళ్లదాడికి పాల్పడుతూ తమ పైశాచికత్వాన్ని, రాక్షసత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ సారి జరిగిన వినాయక పర్వదినాల్లో కూడా పలు ప్రాంతాల్లోని విగ్రహాలు, ఊరేగింపులపై దాడికి పాల్పడి కుక్కతోక వంకరే అని మరోమారు నిరూపించుకునారు. హిందూ దేశమైన భారత్​ లో హిందూ పండుగలపై దాడులు చేస్తాం. ఎవరేం చేస్తారో చూసుకుంటాం. అనే రీతిలో వీరి దాడులు కొనసాగడంప హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 
మరోవైపు బంగ్లాదేశ్​ లో కూడా వినాయక వేడుకలు నిర్వహించిన  వారిపై 11 దాడులు జరిగాయి. ఇలాంటి దాడులకు పాల్పడేది జిహాదీలే అని పలువురు చెబుతున్నారు. 
 
సెప్టెంబర్​ 6న గుజరా లోని కచ్​ జిల్లా ముంద్రాలో ఊరేగింపుపై దాడి, సెప్టెంబర్​ 7న మధ్య ప్రదేశ్​ లోని రత్లాం జిల్లా మోచిపురాలో వినాయక విగ్రహంపై రాళ్ల దాడి, సూరత్​ లో 7, 8 తేదీల్లో వినాయక మండపాలపై దాడులు, కచ్​ లో విగ్రహం ధ్వంసం, లక్నోలో ఉరేగింపుపై రాళ్లదాడి,  కర్ణాటక మాండ్యలో ఊరేగింపుపై దాడులు, గుజరాత్​ మహోబాలో వినాయక విగ్రహంపై రాళ్లదాడి, మహారాష్ర్ట భివాండీలో ఊరేగింపుపై రాళ్ల దాడుల్లో విగ్రహం ధ్వంసం, ఘుఘట్​ నగర్​ లో నెలకొల్పిన విగ్రహంపై దాడులు జరిగాయి.
 
విగ్రహాలు, ఊరేగింపులపై దాడికి పాల్పడిన వారిలో ఎక్కువగా మైనర్లే ఉండడం గమనార్హం. వీరికి రాళ్ల దాడులు చేయడమని ఎవరు నూరి పోశారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయా దాడుల్లో మొత్తం 27మందిని అరెస్టు చేశారు. మరింత మంది పరారీలో ఉన్నారు. ఆయాచోట్ల దాడుల సందర్బంగా హిందువులకు చెందిన వాహనాలు, దుకాణాలపై ఈ జిహాదీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. దీంతో తీవ్ర నష్టం ఏర్పడింది. 
 
హిందూసంఘాల ఆందోళనలు..
ఆయా దాడులు విభిన్న ప్రాంతాల్లో జరిగినప్పటికీ వీటన్నింటి మధ్య జిహాదీలే ఉన్నారని వీరి లక్ష్యం హిందూవులు, వారు నిర్వహించుకునే పర్వదినాలేనని హిందూసంఘాలు పలుపోలీస్​ స్టేషన్ల వద్ద, చౌరస్తాల వద్ద ఆందోళనకు దిగాయి. వీరిని వెంటనే అరెస్టు చేసి, భవిష్యత్​ లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశాయి.