లక్నో: ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తిన కాంగ్రెస్, కూటమి పార్టీల తీరుపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ యోగి ఫైర్ అయ్యారు. సచ్ఛీలత ఉన్న నేతలతే కాంగ్రెస్, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న స్థానాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ లపై గెలిచిన వెంటనే ఎందుకు ప్రశ్నలు లేవనెత్తలేదని అధికారంలోకి ఎందుకు కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమదైతే ఒకలా, మరొకరిదైతే ఇంకోలా? అని మండిపడ్డారు. బ్యాలెట్లను సైతం దొంగిలించిన పార్టీలు మీరేనని దుయ్యబట్టారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
ఓటుకు కోట్లు దోచుకునే వాళ్లే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసి కాంగ్రెస్ వారు ఈవీఎంలపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. దేశంలో మరోసారి సురక్షిత మోదీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు.
భారత్ లో ఉంటూ హిందువులకు పవిత్రమైన ఆవు మాంసం తింటే కాంగ్రెస్, కూటమి పార్టీలు వారిని సమర్థిస్తాయా? అని మండిపడ్డారు. మిగతా దేశ ప్రజలకు వ్యతిరేకంగా వీరి అన్నపానీయాలు ఉండడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పక్కకు నెట్టి గొడ్డు మాంసం విషయంలో హస్తం పార్టీ దేశ ప్రజలకు వ్యతిరేకంగా వెళుతుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఓటమి పాలైన ప్రాంతాల్లోనే ఈవీఎంలు, వీవీ ప్యాట్ లపై సమస్య అని కాంగ్రెస్, కూటమి పార్టీలు చెబుతాయని అన్నారు. మరీ వారు అధికారంలోకి వచ్చిన ప్రాంతాల్లో నుంచి ఎందుకు కోర్టులకు పిటిషన్లు వెళ్లవని ప్రశ్నించారు.
హిమాచల్, కర్ణాటక లో కూడా బ్యాలెట్ పేపర్ ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. 2004లో యూపీఏ ప్రభుత్వం, 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ ద్వారా ఏర్పాటయ్యాయా అని ప్రశ్నించారు. దేశంలో అధికారం లేకపోవటం, అవినీతి, అక్రమార్కులపై దర్యాప్తు సంస్థలు విజృంభిస్తుండడంతో వీరి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. అందుకే లేని పోని ఆరోపణలు చేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఏది ఏమైనా ఈసారి కూడా మోదీ నేతృత్వంలో 400 పైచిలుకు స్థానాలతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని యోగి తెలిపారు.