టాటాఏస్ టారీ ఢీ రోడ్డుపై పడ్డ రూ. 7 కోట్ల నగదు కట్టలు
స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ కు గాయాలు ఆసుపత్రికి తరలింపు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లోని నల్లజర్ల మండలం అనంతపల్లిలో టాటా ఏస్ వాహనం లారీని ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో అందులో దాచిపెట్టిన రూ. 7 కోట్ల నగదు కాస్త రోడ్డుపై పడిపోయింది. శనివారం చోటు చేసుకున్న ప్రమాదం వల్ల అక్రమ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును టాటా ఏస్ లో అట్ట పెట్టెల్లో దాచి తీసుకువెళుతుండగా అతివేగం కారణంగా ప్రమాదం చోటు చేసుకోవడం విషయం బట్టబయలైనట్లయ్యింది.
స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చారు. డ్రైవర్ కు గాయాలు కాగా అతన్ని గోపాలపురం ఆసుపత్రికి తరలించి చికిత్సందిస్తున్నారు. వాహనం విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతోండా ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ విషయం బట్టబయలైనట్లు పోలీసులు తెలిపారు. నగదు ఎవరి వద్ద నుంచి ఎవరి వద్దకు వెళుతుందనే విషయాన్ని విచారిస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం కూడా రూ. 8 కోట్ల నగదు పట్టుబడిన విషయం తెలిసిందే.