మిగులు బదలాయింపునకు ఆర్బీఐ ఆమోదం

రూ. 2.11 లక్షల కోట్ల మిగులుపై సెంట్రల్​ బ్యాంక్​ ధృవీకరణ రిస్క్​ బఫర్​ ను 6.5 శాతానికి పెంచాలని నిర్ణయం గత రుణాలు రూ.60వేల కోట్లను చెల్లించాలని కేంద్రం నిర్ణయం కేంద్ర ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం మే నెలాఖరులో ఆర్బీఐ బదిలీ ప్రకటన?

May 22, 2024 - 17:01
 0
మిగులు బదలాయింపునకు ఆర్బీఐ ఆమోదం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.2.11 లక్షల కోట్ల మిగులును ప్రభుత్వానికి బదలాయించేందుకు ఆర్బీఐ  ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని సెంట్రల్ బ్యాంక్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధృవీకరించింది.

2024–25 సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్​ అంచనాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్​ ను ఆర్బీఐ అంచనా వేస్తోంది. అదే సమయంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.87,416 కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసింది. వాస్తవ అంచనాలకు గణనీయంగా డివిడెంట్​ మించిపోయింది. ఈ ఏడాది అధిక మిగులు బదిలీ మెరుగైన ఆర్థిక ఫలితాలు, కేంద్ర బ్యాంకులు సాధించిన లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. రిస్క్ బఫర్ ను 6.5 శాతానికి పెంచాలని ఆర్ బీఐ బోర్డు నిర్ణయించింది.

తన మునుపటి రుణాలలో రూ .60,000 కోట్లను ముందస్తుగా తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా ప్రభుత్వానికి మద్దతు పలికినట్లుగా అయ్యిది. ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్న వినియోగించని నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఆర్బీఐ చర్యలతో ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవకాశం లభించినట్లయ్యింది. 

అయితే ఈ నిధులను మే నెలాఖరునాటికి మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రకటన ఆర్బీఐ చేయనున్నట్లు పలువురు ప్రముఖులు వెల్లడించారు. దీంతో కేంద్ర ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం కల్పించినట్లవుతుంది.