ఈయూ రాజకీయ నాయకులపై దాడులు
డెన్మార్క్ పీఎంపై దాడికి యత్నం అడ్డుకున్న భద్రతా సిబ్బంది
డెన్మార్క్: ఈయూ (యూరోపియన్ యూనియన్) ఎన్నికలకు ముందు డెన్మార్క్ పీఎం ఫ్రెడెరికిసెన్ పై శుక్రవారం దాడి జరిగింది. ఈ విషయం శనివారం వెలుగులోకిచ్చింది. ఈనెల 9న ఈయూ ఎన్నికలు జరగనున్నాయి. సోషల డెమోక్రాట్ అభ్యర్థి క్రిస్టల్ తో కలిసి ప్రధాని ఫ్రెడెరికిసెన్ జోరుగా ప్రచారం నిర్వహించింది. ప్రచారం ముగించుకొని రాత్రికి తిరిగి ఇంటికి వెళుతుండగా ఓ దుండగులు వెనుక నుంచి వచ్చి ఆమెను బలంగా నెట్టాడు. దాడి చేసేందుకు సిద్ధం కాగా అప్పటికే ఆమె చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతన్ని నిర్బంధించారు. ఆమెను నెట్టడంతో కిందపడబోయి తమాయించుకుంది. అయితే ఆమెను తోసి దాడికి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈయూ ఎన్నికల సందర్భంగా గతంలోనూ పలువురిపై దాడులు జరిగాయి. జూన్ 4న ఆల్టర్నేటివ్ జర్మనీ పార్టీకి చెందిన ఓ నాయకుడిపై దుండగుడు కట్టర్ తో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. ఆయన గాయాలతో బయటపడ్డారు. డోమోక్రాట్ ల ఎంపీ అభ్యర్థి మాథియాస్ ఏకేపై కూడా దాడి జరగ్గా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.మే 15న స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆయనకు బుల్లెట్లు తగిలినా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పలు ఆపరేషన్లు నిర్వహించి బుల్లెట్లను తొలగించారు. మే 30వ తేదీన ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.