ఆగస్ట్ 25న మన్ కీ బాత్
Mann Ki Baat on 25th August
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఆగస్ట్ 25 నిర్వహించనున్నట్లు ప్రధాని కార్యాలయం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 113వ ఎపిసోడ్ లో ప్రసారమవుతుందని పేర్కొంది. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, వెబ్ సైట్లలో ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చని తెలిపింది. ప్రాంతీయ భాషల్లో కూడా ఈ కార్యక్రమ వివరాలను ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ ఆలోచనలు, సూచనలు పంచుకోదలిస్తే టోల్ ఫ్రీ నంబర్ - 1800 11 7800లో సంప్రదించాలన్నారు. నరేంద్ర మోదీ యాప్, మై గవర్నమెంట్ ఓపెన్ ఫోరమ్‌లో కూడా ఆలోచనలు పంచుకోవచ్చన్నారు. ఆగస్ట్ 23వ తేదీ వరకు ఆలోచనలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.