జిల్లాలో హిందువుల పరిస్థితి దయనీయం
బీజేపీ నేత రావుల రాంనాథ్
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందువుల పరిస్థితి దయనీయంగా తయారయిందని బీజేపీ రాష్ట్ర నేత రావుల రాంనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హిందువుల పండుగలు వస్తున్నాయంటే పండగల మీద ఆంక్షలు విధిస్తూ పోలీసులు 30 యాక్ట్ అమలు చేయడం పరిపాటిగా మారిందని అన్నారు. పండుగల ఊరేగింపులు నిర్వహణ, డీజే సౌండ్లపై ఆంక్షలు సర్వసాధారణం అయ్యాయన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు మూడు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వని కారణంగా చేస్తున్న సమ్మె ఫలితంగా నిర్మల్ పట్టణం దుర్గంధపూరితంగా తయారయిందన్నారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే కమిషన్లు వస్తాయన్న కక్కుర్తితో కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.