నిఖార్సైన గాంధేయవాదిని

జేకేఎల్​ఎఫ్​–వై ఉగ్రవాది యాసిన్​ మాలిక్​

Oct 5, 2024 - 12:07
 0
నిఖార్సైన గాంధేయవాదిని

శ్రీనగర్​: తాను ఆయుధాలు వదిలి 30యేళ్లు అయ్యిందని, నిఖార్సైన గాంధేయవాదిని తీహార్​ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జేకేఎల్​ ఎఫ్​–వై (జమ్మూకశ్మీర్​ లిబరేషన్​ ఫ్రంట్​) యాసిన్​ మాలిక్​ అన్నాడు. ఉపా ట్రిబ్యునల్​ లో తాను వేసుకున్న అఫిడవిట్​ లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ట్రిబ్యునల్​ అఫిడవిట్​ సమర్పణలో శనివారం ఈ విషయాలు వెలుగులోకొచ్చాయి. జమ్మూకశ్మీర్​ లో జేకేఎల్​ఎఫ్​–వై1988లో స్థాపించిన యాసిన్​ మాలిక్​ కరడుకట్టిన ఉగ్రవాది. రాళ్లదాడులు, పాక్​ నుంచి నకిలీనోట్ల వ్యాపారం, పాక్​ అధికారులతో వైర్​ లెస్​ సెట్లతో మాట్లాడటం, భారత వ్యతిరేక చర్యలకు పాల్పడడమే గాక 1990 శ్రీనగర్​ రావల్​ పురాలో నలుగురు భారత వైమానిక దళ సిబ్బందిని హత్య చేయడంలో ఇతనే ప్రధాన నిందితుడు.

బీజేపీ ప్రభుత్వం కొలువయ్యాక ఈ ఉగ్రసంస్థను నిషేధించి చర్యలు చేపట్టింది. సోదాలు నిర్వహించింది. సోదాల్లో జమ్మూకశ్మీర్​ లోని తన ఇంట్లోనే దర్జాగా పాక్​ అధికారులతో మాట్లాడుతున్న వైర్​ లెస్​ సెట్లను, నోట్ల కట్టలను సరిహద్దు కీలక ప్రాంతాల మ్యాపులను, ఆర్మీ క్యాంపుల వివరాలను స్వాధీనం చేసుకున్నాయి. యాసిన్​ ను అరెస్టు చేశారు. పాక్​ ప్రభుత్వం యాసిన్​ భార్యకు మంత్రి పదవి కూడా ఇచ్చింది. 2022 మే లో టెర్రర్​ ఫండింగ్​ కేసులో ఇతనికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.