సీఎం పీఠంపై పొంగులేటి కన్ను
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపణ
నా తెలంగాణ, ఆదిలాబాద్: సీఎం పీఠంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్ను పడిందని బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కొంతమంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని ఏకంగా సీఎంనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగారని ఆరోపించారు. కర్ణాటకలో డీకే శివకుమార్ మాదిరిక పొంగులేటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతేగాక ఢిల్లీలోనే పొంగులేటి పావులు కదుపుతున్నారని ఆరోపించారు. పొంగులేటి అసలు వ్యూహాం ఏంటో పార్టీ నాయకులకే అర్థం కాకుండా ఉందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.