పీడీఎస్​ బియ్యం పట్టివేత

PDS rice harvesting

Oct 9, 2024 - 19:52
 0
పీడీఎస్​ బియ్యం పట్టివేత

నా తెలంగాణ, అందోల్​: టేక్మాల్ మండల పరిధిలోని బొడుమెట్పల్లి గ్రామ శివారులో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలుతున్న పీడీఎస్​ రేషన్ బియ్యాన్ని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వాహనం నెంబర్ టీఎస్ 09 యు సి 1260 గల వాహనంలో అక్రమంగా 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నారని  పోలీసులు తెలిపారు. ఈ రేషన్ బియ్యం పాపన్నపేట మండలంలోని లక్ష్మీ నగర్ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో భద్రపరచి నట్టు ఆర్ఐ సాయి శ్రీకాంత్  తెలిపారు. టెక్మల్ పోలీస్ స్టేషన్ కు వాహనాన్ని తరలించి కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.