రాష్ట్రపతికి రాజీనామా, ప్రమాణ స్వీకారం లేఖ
Letter of resignation and oath of office to the President
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి రాజీనామా, నూతన సీఎం అతిశీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన లేఖ, నివేదికను బుధవారం ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూకు పంపారు. నివేదిక ప్రకారం అతిశీ నూతన సీఎంగా సెప్టెంబర్ 21న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ లోపే కేజ్రీవాల్ సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్ భద్రతను కూడా వద్దనడంలో పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడే దాడి జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు కేజ్రీవాల్ ఎక్కడ నివసిస్తారో? ఇంకా స్పష్ట రాలేదని సంజయ్ సింగ్ తెలిపారు.