సైబర్ నేరాలపట్ల అప్రమత్తం
సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి
నా తెలంగాణ, సంగారెడ్డి: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని కంది మండలంలో ఉన్న అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం అగ్రికల్చర్, ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కళాశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు ర్యాగింగ్ కు దూరంగా ఉండాలన్నారు.
ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థిని, విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కి అలవాటు పడి చేజేతుల జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ అశోక్ కుమార్, సబ్ ఇన్స్ పెక్టర్ కె.వినయ్ కుమార్, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.