జోన్​ మార్పిడి చేపట్టండి

మంత్రికి ట్రెస అధ్యక్షుడి వినతిపత్రం

Sep 4, 2024 - 18:27
 0
జోన్​ మార్పిడి చేపట్టండి
నా తెలంగాణ, మెదక్​: మెదక్​ జిల్లాను రాజన్న జోన్​ నుంచి చార్మినార్​ జోన్​ కు మార్చేందుకు చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్​ ట్రెస అధ్యక్షులు మహేందర్​ గౌడ్​ తో కలిసి వినతిపత్రం సమర్పించారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన దామోదర రాజనర్సింహను కలిసి తమ సమస్యలను వివరించారు. రాజన్న జోన్​ లో చేర్చడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల లాభనష్టాల గురించి, స్థానికత గురించి మంత్రికి వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ మంత్రికి జ్ఞాపికను అందించారు. మంత్రిని కలిసిన వారిలో టీఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు మహ్మద్ ఇక్బాల్ పాషా, ట్రెస నాయకులు సిద్దు, పరమేశ్వర్, నాగరాజు తదితరులున్నారు.