హై కమిషనర్లను వెనక్కి పిలిచిన బంగ్లా
ఉత్తర్వులు జారీ చేసిన పీఎం కార్యాలయం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ లోని హైకమిషనర్ తో ఐదు దేశాల్లో ఉన్న తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ కార్యాలయం ఈ మేరకు గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది వెంటన ఢాకాకు తిరిగి రావాలని కోరింది. భారత్ తోపాటు ఆస్ట్రేలియా, బెల్జియం, పోర్చుగల్, ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తలను కూడా వెనక్కి పిలిపించారు. బంగ్లాదేశ్ లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిన తరువాత ఆ దేశంలో చెలరేగుతున్న అలజడులు ప్రపంచదేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులు, హిందూసమాజంపై జరుగుతున్న దాడులతో పలుమార్లు భారత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. షేక్ హసీ హసీనా రాజీనామా, దేశం విడిచి భారత్ లో ఉండడం, భారత్ కు వ్యతిరేకంగా ఉన్న కొందరు విద్యార్థి ఉగ్రనాయకులు తాత్కాలిక ప్రభుత్వంలో చోటు సంపాదించడం వంటి పరిణామాలతో ప్రస్తుతం బంగ్లా తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. దీన్ని పూడ్చుకునేందుకే హై కమిషనర్లను వెనక్కు పిలిపించిందా? లేక మరెదైనా కారణమా? అనే విషయం తెలియదు.