రాహుల్ ‘మేడ్ ఇన్ ఇటలీ’
మండిపడ్డ కేంద్రమంత్రి సుకాంత మజుందార్
కోల్‌కతా: రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ ఇటలీ’ బ్రాండ్ అని విద్యాశాఖ కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ విమర్శించారు. గురువారం అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ, భారత్ పై చేసిన ఆయన విమర్శలను తిప్పికొట్టారు. విదేశాల్లో ఏదైనా జరిగితే రాహుల్ ఎగిరెగిరి పడుతుంటారన్నారు. అదే భారత గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని విదేశాల్లో తాకట్టుపెట్టేలా ప్రవర్తిస్తారి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ర్టాల్లో అభివృద్ధిపై మాట్లాడేందుకు ఈయనకు నోరు రాదన్నారు. కేరళలో పోర్టు పనులను అదానీ చేపడుతున్నారన్న విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. దీనిపై ఎంవోయూ కూడా కుదిరిందన్నారు. దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు రాహుల్ ప్రయత్నించడం ఆయన కుటీలనీతికి నిదర్శనమన్నారు.