నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: పెరుగుతున్న ఆర్థిక అసమానతలతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చైనా వెనుకబడేందుకు పలు స్వయంకృతాపరాధాలే కారణంగా నిలిచాయి. ప్రజల్లోనూ క్రమేణా కమ్యూనిస్టుల కఠిన పాలన, వైఖరులపై వ్యతిరేకత వస్తోంది. దేశంలో అంతర్గతం జరుగుతున్న ఆర్థిక, సామాజిక అసమానతలు బయటకు చెప్పుకోలేని పరిస్థితులను జిన్ పింగ్ (కమ్యూనిస్టు) ప్రభుత్వం చేపట్టింది. దీంతో అంతర్జాతీయ సమాజంలో చైనా పెద్ద ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ అంతర్గతంగా ఎదుర్కొంటున్న భారీ సవాళ్లతో తీవ్రంగా సతమతం అవుతుందనేది తెలుస్తుంది.
కంటిమీద కునుకు లేదా?..
కరోనా కాలం, ఇతర దేశాల సరిహద్దుల్లో జోక్యం, నకిలీ వస్తువుల సరఫరా, ఏయిర్ బెలూన్ల ద్వారా గూడాచార వ్యవస్థ, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న దేశాల మాటలను పెడచెవిన పెట్టడం, భారత్ ఆర్థిక ఎదుగుతుండడం ఇవన్ని విషయాలు ప్రస్తుతం జిన్ పింగ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి ఆలోచనల్లోకి నెట్టివేస్తున్నాయి. ప్రపంచంలో మోనోపాలీ (ఏకఛత్రాధిపత్యం) తామేనన్నట్లుగా ప్రవర్తించిన చైనాకు ఈ పరిణామాలన్నీ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ పరిణామాలతోబాటు క్రమేణా చైనా ప్రజల్లో జిన్ పింగ్ అంటేనే ఆగ్రహం నశాళానికి ఎక్కేంతగా ఉంది. బలమైన, క్రూరమైన చట్టంలోని విధానాలతో ప్రజలను అణగదొక్కే విధంగా ఉండడం కూడా ప్రజాగ్రహానికి ఒక కారణంగా నిలుస్తోంది.
ప్రాజెక్టులు పూర్తిగాక తలపట్టుకుంటున్న జిన్ పింగ్!..
ఇప్పటిక అనేక దేశాల్లో పెట్టుబడులు పెట్టిన చైనా ఆయా దేశాల్లో ఆ ప్రాజెక్టులు పెండింగ్ లో పడడం, స్థానిక వ్యతిరేకత, ఉగ్రదాడులు, ఆ దేశాలు పునరాలోచనలో పడడంతో నిలిచిపోయాయి. దీంతో చైనా విదేశీ మారకద్రవ్యం క్రమేణా తగ్గుముఖం పడుతోంది. అదే సమయంలో చైనా తరువాత అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రపంచ దేశాలతో ఏకీభవిస్తూ మోనోపాలిని పక్కన పెట్టి ప్రపంచ మానవాళి మనుగడ, శాంతి, సుహృద్భావ వాతావరణంలో వెళుతూ ఆర్థికంగా పటిష్టపడుతోంది. అంతేగాక క్లిష్టపరిస్థితుల్లో సైతం రూపాయి ఆశించకుండా చాలా దేశాలకే తామున్నామన్న భరోసా కల్పిస్తోంది. మరోవైపు ఐక్యరాజ్యసమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై మద్దతు పెరిగింది. ఇవన్ని పరిణామాలు చైనాకు ఏవగింపుగా మారాయి. దీంతో డోక్లాం సరిహద్దు వివాదంపై చర్చలకు ముందుకు రాగలిగింది. భారత్ తో చర్చల అనంతరం 75 శాతం వివాదాలను సద్దుమణిగింప చేసుకుంది.
చైనాతో దోస్తీనా?.. నో అంటున్న ప్రపంచదేశాలు!..
ఆర్థిక పెరుగుదలకు జిన్ పింగ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రపంచదేశాలు ఆ దేశంతో సంబంధాలను పెట్టుకోవాలంటేనే ఆలోచించే పరిస్థితులు వచ్చాయి. మరోవైపు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టైన రియల్ రంగం పూర్తిగా కుదేలయ్యింది. ఎన్ని చర్యలు చేపట్టినా ఈ రంగం ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు
బెదిరింపు ధోరణితో మొదటికే మోసం!..
చైనా పరిస్థితులకు జిన్ పింగ్ (కమ్యూనిస్టు) పాలన బెదిరింపు ధోరణియే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. అంతర్జాతీయ వేదికలపై శాంతియుతంగా పరిష్కరించుకునే సమస్యలపై కూడా మోనోపాలిలా వ్యవహరిస్తూ తమదే పై చేయి అన్నట్లు వ్యవహరించడమనేది బెడిసి కొట్టి చైనా మరింత కుదేలు కావడానికి కారణమైంది. పైగా ప్రస్తుతం చైనాకు మిత్రదేశాల సంఖ్య వేళ్లపై లెక్కపెట్టొచ్చనేలా తయారైంది. అదే సమయంలో భారత్ మిత్రదేశాల సంఖ్య మూడు డిజిట్లు దాటడం గమనార్హం. ఏది ఏమైనా మోనోపలీ వ్యవస్థతో ప్రపంచాన్ని శాసించాలన్న జిన్ పింగ్ కళ కొన్ని రోజులు బాగానే సాగినా ఎల్లకాలం సాగదనేది మరోసారి నిరూపితమైంది.