ఢిల్లీ అల్లర్ల నిందితుడికి ఎంఐఎం టికెట్

​ హై కోర్టు క్లీన్ చీట్​

Dec 10, 2024 - 14:44
 0
ఢిల్లీ అల్లర్ల నిందితుడికి ఎంఐఎం టికెట్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ అల్లర్లు‌‌–2020 నిందితుడు తాహిర్​ హుస్సేన్​ కు ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ టికెట్​ ను కేటాయించారు. ఆయనకు టికెట్​ కు కేటాయించడం పట్ల బీజేపీ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాహిర్​ హుస్సేన్​ ఆప్​  పార్టీ నేత అల్లర్లలో ఈయన పాత్ర ఉందన్న ఆరోపణలపై కేసు నమోదు కావడంతో ఆప్​ పార్టీ తాహిర్​ ను పార్టీ నుంచి బహిష్కరించింది. ప్రస్తుతం ఆయనకు ముస్తఫాబాద్​ నుంచి ఎంఐఎం పార్టీ టికెట్​ కేటాయించింది. అల్లర్ల సందర్భంగా ఆయన ఇంటిలో బాంబులు, రాళ్లు దొరికినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ కేసులో తాహిర్​ కు ఢిల్లీ హైకోర్టు క్లీన్​ చీట్​ ఇచ్చింది. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీకి అడ్డంకులు తొలగడంతో ఎంఐఎం పార్టీ తాహిర్​ కు టికెట్​ కేటాయించింది. ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించారు. ఒక సమూహాన్ని రెచ్చగొట్టడంతో తాహిర్​ హుస్సేన్​ కీలకంగా వ్యవహరించారని అప్పట్లో పోలీసులు ఆరోపించారు. ముస్తఫాబాద్​ నుంచి ఎంఐఎం టికెట్​ కేటాయించడంతో ఆప్​ పార్టీకి గడ్డుకాలం ఎదురుకానుందనే వాదనలున్నాయి. మరోవైపు ఆప్​–ఎంఐఎం పార్టీలు కుమ్మక్కై తాహిర్​ కు టికెట్​ కేటాయించారనే విమర్శలూ ఉన్నాయి.