‘ఇద్దరబ్బాయిలు’ ప్రారంభం
కాంగ్రెస్, ఎస్పీలు మత ఛాందసవాదులు క్యాన్సర్ కంటే వినాశకరమైన మూడు వ్యాధులు నిరుపేద బిడ్డ మోదీ శ్రావస్తి చారిత్రాత్మక ప్రదేశం పర్యాటకులకు ఆహ్వానం కర్ణాటక మోడల్ ను అనుమతించబోం కరెన్సీ కట్టలతో అవినీతిపరులను కాపాడే ప్రయత్నం యూపీ శ్రావస్తిలో ప్రధాని నరేంద్ర మోదీ
లక్నో: కాంగ్రెస్, ఇండి కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన అతిపెద్ద మూడు వ్యాధులతో బాధపడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
యూపీలో ‘ఇద్దరబ్బాయిలు’ (రాహుల్, అఖిలేష్) సినిమా మళ్లీ ప్రారంభమైందన్నారు. ఉగ్రవాదం, మత ఛాందసవాదులు, అవినీతి, అక్రమాలతో కుటుంబ పాలనే ఈ వ్యాధులన్నారు. ఆవి దేశానికి క్యాన్సర్ కంటే వినాశకరమైనవిగా ప్రధాని పేర్కొన్నారు. బుధవారం యూపీలోని శ్రావస్తిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదన్నారు. తాను ఓ నిరుపేద తల్లికి కొడుకునన్నారు. తాను దేశాన్ని బలంగా మార్చాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. దీనికి అందరి ఆశీస్సులు కావాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
దేశంలోని నిరుపేదలకు ప్రధాని మోదీ కాపలదారుగా వ్యవహరిస్తాడని ప్రధాని పేర్కొన్నారు. శ్రావస్తి ఒక పౌరాణిక, చారిత్రాత్మక ప్రదేశమన్నారు. ఇక్కడి నుంచి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడి వారసత్వం దేశ పటంలో, చరిత్రలో ప్రత్యేక కీర్తిని సాధించాయని పేర్కొన్నారు.
కర్ణాటక మోడల్ రిజర్వేషన్లు మోదీ అనుమతించబోరని పేర్కొన్నారు. కాంగ్రెస్, కూటమిలు పట్టపగలే కరెన్సీ నోట్ల కట్టలతో అవినీతిపరులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు.
మోదీ ఇచ్చిన 4 కోట్ల ఇళ్లను కాంగ్రెస్, ఎస్పీలు లాక్కోవాలని భావిస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. 50 కోట్ల మందికి జన్ ధన్ ఖాతాలు తెరిచామన్నాఉ. ప్రతీ పల్లెకు నీరు, విద్యుత్, వైద్యం, విద్య, మౌలిక సదుపాయాలు అందించిన ఘనత తమదని అన్నారు.
60 ఏళ్లుగా దేశానికి, దేశ నిరుపేదల కోసం ఏమీ చేయలేని వారు ప్రస్తుతం ఏదో చేస్తామని మభ్యపెడుతూ ఓట్లు దండుకుంటున్నామని అన్నారు. మరీ ఇన్నేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.
యూపీలో ‘ఇద్దరబ్బాయిలు’ (రాహుల్, అఖిలేష్) సినిమా మళ్లీ ప్రారంభమైందన్నారు. ఇదే సమయంలో పాత డైలాగులు వల్లేవస్తూ వీరు ఓట్లను దండుకోవాలని చూస్తున్నారని అన్నారు. డబ్బులు చెల్లించకపోవడంతోనే అఖిలేష్ సభలో గందరగోళం చెలరేగుతోందన్నది దేశ ప్రజలకు తెలియదన్నారు. యువరాజు, ఎస్పీ ప్రధాన నాయకులిద్దరి సభలోనూ ఇలాగే ప్రజలు గందరగోళం సృష్టించారని అందరూ అనుకున్నారని అన్నారు. వాస్తవం విషయం అదీ కాదన్నారు. సభకు తీసుకువచ్చిన వారికి ఆహారం, నీరు, సౌకర్యాలు, డబ్బులు అందించలేకపోయిన నీచ చరిత్ర వీరిదని ప్రధాని మోదీ మండిపడ్డారు.