నేనొప్పుకోను!

రిజర్వేషన్లపై హైకోర్టుపై మమత భగ్గు

May 22, 2024 - 18:26
 0
నేనొప్పుకోను!

కోల్​ కతా: ఓబీసీ రిజర్వేషన్లను కోల్​ కత్తా హైకోర్టు రద్దు చేసింది. దీనిపై పశ్చిమ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పును ఒప్పుకునేది లేదని పేర్కొంది. ఈ తీర్పు ఆమోద యోగ్యం కాదని డమ్​ డమ్​ లో నిర్వహించిన బహిరంగ సభలో బుధవారం సీఎం మమత పేర్కొంది. రాజ్యాంగ విచ్ఛిన్నానికి దారితీస్తుందని మమత హెచ్చరించింది. ప్రముఖ న్యాయమూర్తి ఈ ఆదేశాలిచ్చారని విన్నానని మమత పేర్కొన్నారు. ఇది రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే నిర్ణయమన్నారు. ను ఈ నిర్ణయాన్ని అమలు చేయలేదని మమత అన్నారు. ఓబీసీ రిజర్వేషన్​ కు ముందే సర్వే జరిగిందన్నారు. 

వాస్తవం ఏంటీ?

2010లో ఓబీసీ జాబితాను పశ్చిమ బెంగాల్​ ప్రభుత్వం రద్దు చేసింది. దీని ఆధారంగా కొత్త రిజర్వేషన్లు ఇవ్వబోమని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం రిజర్వేషన్లపై జస్టిస్​ తపోబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంతర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.