ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
SC ST Atrocity Case Registration
నా తెలంగాణ,రామకృష్ణాపూర్:సారంగపెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ని కులం పేరుతో దూషించినందుకు బుధవారం మందమర్రి పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదైంది.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మందమర్రి మండలం సారంగపెల్లి గ్రామానికి చెందిన అక్కపాక శంకర్ ని అదే గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ కులం పేరుతో దూషించడం జరిగిందని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేసినట్లు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తెలిపారు