ముంబైలో కుండపోత నలుగురు మృతి

పాఠశాలలు, కళాశాలలకు సెలవు

Sep 26, 2024 - 18:13
 0
ముంబైలో కుండపోత నలుగురు మృతి

ముంబై: ముంబైలో కుండపోత వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. బుధ, గురవారాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. కుండపోత వర్షాల వల్ల నలుగురు చనిపోయారు. ముంబైలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. 275 సెం.మీ. వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. రైళ్లు, బస్సుల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడింది. ముంబై సగం జనజీవనం స్తంభించిపోయింది. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబై వ్యాప్తంగా రెడ్​ అలెర్ట్​ జారీ చేశారు. ముంబై వాసులు అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఆదేశించారు. 
లక్షలాది వాహనాలు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోవడంతో వాహనాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లిపోయారు. దీంతో రహదారుల్లో ఎక్కడ చూసినా వాహనాలే దర్శనమిస్తున్నాయి. ఈ వర్షాల వల్ల ముంబై అవతలి ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లింది.