అమెరికా ఎన్నికలు షురూ

The US elections are about to begin

Nov 5, 2024 - 14:35
 0
అమెరికా ఎన్నికలు షురూ
వాషింగ్టన్​ డీసీ: అమెరికాలో పోలింగ్​ ప్రారంభమైంది. ప్రజాతీర్పుతో అమెరికా 47వ అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోనుంది. కమలా? ట్రంపా?  అధ్యక్షులు ఎవరన్నది సర్వేల్లో కూడా చాలా దగ్గరి వ్యత్యాసాలు ఉండడంతో నిర్ణయాన్ని తేల్చలేకపోతున్నాయి. 
 
హాంప్​ షైర్​ లో తొలి ఓటు నమోదైంది. ఇప్పటికే 8 కోట్ల మంది ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. డెమోక్రటిక్​ పార్టీకి చెందిన కమలా హారీస్​ ముందస్తుగా ఓటేశారు. మరోవైపు రిపబ్లికన్​  పార్టీకి చెందిన ట్రంప్​ స్వింగ్​ రాష్​ర్టాలపై దృష్టిసారించారు. 24 కోట్ల మంది అర్హులైన ఓటర్లున్నారు. 2020లో 66 శాతం మాత్రమే ఓటింగ్​ నమోదైంది. ఈసారి పోలింగ్​ శాతాన్ని పెంచాలని ఇరుపార్టీల అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేశారు. 
 
రెండు పార్టీల ప్రాధాన్యత ఏడు స్వింగ్ రాష్ట్రాలపై ఉంది. ఈ రాష్ట్రాల ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో అదే పార్టీ విజయం సాధించే పరంపర కొనసాగుతూ వస్తోంది. అమెరికాలోని 50 రాష్ట్రాలున్నాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. స్వింగ్ రాష్ట్రాల్లోనే 93 సీట్లు ఉండగా, ట్రంప్,  కమల ఎన్నికల్లో గెలవాలంటే 270 సీట్లు గెలవాలి. అటువంటి పరిస్థితిలో, స్వింగ్ రాష్ట్రాలు అమెరికా అధ్యక్షుడిని నిర్ణయిస్తాయి.