క్యాన్సర్ మందుల ధరలు తగ్గించాలి
తయారీదారీ సంస్థలకు కేంద్రం ఆదేశం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మూడు రకాల క్యాన్సర్ నిరోధక మందుల ఎమ్మార్పీ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. క్యాన్సర్ మందులపై కేంద్ర ప్రభుత్వం జూలై 23న కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా ఇప్పటివరకూ పలు ఔషధ సంస్థలు క్యాన్సర్ మందులపై ధరలను తగ్గించలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే మందులను ధరలను తగ్గించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో క్యాన్సర్ రోగులు వినిగిస్తున్న ట్రాస్టూజుమాబ్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ అనే మూడు క్యాన్సర్ నిరోధక ఔషధాలపై ఎమ్మార్పీని తగ్గించాలని ప్రభుత్వం ఔషధ కంపెనీలను ఆదేశించింది. ఈ మూడు రకాల ఔషధాలపై కేంద్రం సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది.