ఎన్​ఎస్​ఏగా మూడోసారి దోవల్​ నియామకం

పీఎం ప్రిన్సిపల్​ సెక్రెటరీగా పీకే మిశ్రా

Jun 13, 2024 - 18:30
 0
ఎన్​ఎస్​ఏగా మూడోసారి దోవల్​ నియామకం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అజిత్​ దోవల్​ పేరు చెప్పగానే దేశ వ్యతిరేక శక్తులకు చెమటలు పట్టేస్తాయన్న విషయం చెప్పక్కరలేదు.  దోవల్​ మూడోసారి ఎన్​ఎస్​ఏ (భారత జాతీయ భద్రతా సలహాదారుగా) నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి కేంద్ర కేబినెట్​ నియామకాల కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. ఈయనతోబాటు పీకే మిశ్రా ప్రధానమంత్రికి ప్రిన్సిపల్​ సెక్రెటరీగా కొనసాగనున్నారు. ఈ రెండు పదవుల్లోనూ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అజిత్​ దోవల్​ 20 మే 2014న తొలిసారిగా భారత్​ కు భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈయన పదవిలో కొనసాగుతున్నారు. 1968 బ్యాచ్​ కు చెందిన ఐపీఎస్​ అధికారి దోవల్​. దౌత్యపరమైన బంధాలు, ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దోవల్​ కు సాటి ఎవరు లేరనే వాదనలు కూడా ఉన్నాయి. 

పీకే మిశ్రా 1972 బ్యాచ్​ అధికారి. గత పదేళ్లుగా ఆయన ప్రధాని మోదీకి ప్రిన్సిపల్​ సెక్రెటరీగా కొనసాగుతున్నారు. పీఎం కార్యాలయంలో పరిపాలనా వ్యవహారాలు, నియామకాలు లాంటి పనులను పీకే మిశ్రా పర్యవేక్షిస్తారు.